ఈ రోజుల్లో పొట్లకాయ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అప్పట్లో ఇంటర్నెట్లు, హెల్త్ వెబ్ సైట్స్ లేకపోయినా వాళ్లకి అది తినటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో బాగా తెలుసు. అందుకే వారంలో ఒకసారి కచ్చితంగా తినేవారు.  

ఈ రోజుల్లో పొట్లకాయ తినకపోవడానికి కారణం అందులో ఎన్ని పోషకవిలువలు దాగి ఉన్నాయో తెలియకపోవటమే అయ్యుంటుంది.

పొట్లకాయలో ఏ,బీ, సీ విటమిన్లతో పాటు పలు ఐరన్, కాల్షియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియంలు లభిస్తాయి.

టైప్-2 మధుమేహం గల వ్యక్తులకు పొట్లకాయ గొప్ప ఆహార పదార్ధంగా ఉంటుంది. 

పొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయని చెప్పబడింది. రక్తస్రావం, శరీర ఉష్ణోగ్రతను పెంచే ఏ జ్వరాన్నైనా తగ్గిస్తుంది. 

కొద్దిగా తేనె, ఛిరెట్టా అని పిలవబడే మూలికను పొట్లకాయతో కలిపి తీసుకోవడం ద్వారా బిలియస్, మలేరియా జ్వరాలకు అద్భుత ఔషధంలా పనిచేస్తుంది

కామెర్లతో బాధపడుతున్న వారు తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవలసి ఉంటుంది. కొత్తిమీర, పొట్లకాయ ఆకులను కలిపి తీసుకోవడం కామెర్ల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. 

పొట్లకాయలోని పోషకపదార్ధాలు హృదయ సంబంధిత సమస్యలను అరికట్టడానికి ఎంతగానో దోహదం చేస్తాయి

మలబద్ధకం అనేది ఆహారంలో నీరు, ఫైబర్ లేకపోవడం, సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం మొదలైన కారణాల వలన వస్తుంది. పొట్లకాయ రసం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

పొట్లకాయ బరువును క్రమబద్దీకరించడంలో అద్భుతంగా సహాయం చేస్తుంది. 

పొట్లకాయను తినడం వల్ల పలు చర్య సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.