Daku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ పేరు ఫిక్స్ చేస్తూ ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
Read Also:Pushpa -2 : 2024 బుక్ మై షో రికార్డ్ లిస్ట్ లో పుష్ప ర్యాంక్ ఎంతంటే..?
ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. బాలయ్య పాత్రను, రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను మాస్ మహారాజ్ చెప్పబోతున్నాడని టాక్. పైగా రవితేజ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. అన్నట్టు ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాలో చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Read Also:Hyderabad Air Show: నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు..