ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది పుష్ప 2. ఇప్పటికే రూ. 500 కోట్లు ధాటి పరుగులు తీస్తుంది.
కాగా టికెట్స్ పరంగాను ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో పుష్ప ప్రతి గంటకు పది లక్షలకు పైగా బుక్ అయిన మొట్ట మొదటి సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఇక ఈ ఏడాదిలో బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాల టాప్ 10 సినిమాల లిస్ట్ చుస్తే ఫస్ట్ ప్లేస్ లో రెబల్ స్టార్ కల్కి : 13.14 మిలియన్, శ్రద్ద కపూర్ స్త్రీ2 : 11.40 మిలియన్, పుష్ప2 : 8.17M ( కేవలం3 రోజులు), శివకార్తికేయన్ అమరన్ : 4.89 మిలియన్, ఎన్టీఆర్ దేవర : 4.80మిలియన్, హనుమాన్ : 4.72 మిలియన్, భూల్భూలయ్యా3 : 4.67మిలియన్, విజయ్ గోట్ : 4.51 మిలియన్, మంజుమ్మెల్ బాయ్స్ : 4.30 మిలియన్, అజయ్ దేవగన్ సింగం ఎగైన్ : 3.77 మిళియన్స్ బుకింగ్స్ అందుకున్నాయి. కాగా పుష్ప లాంగ్ రన్ లో కల్కి రికార్డును బద్దలు కొడుతుందని మేకర్స్ ధీమా గా ఉన్నారు. ఇలా పుష్ప ఎక్కడ చుసిన రికార్డుల రప్ప రప్పా చేస్తుంది.