భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో భారత -ఏ జట్టు రెండు టెస్లు మ్యాచ్ ల అనధికారిక సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. నిలకడగా ఆడుతూ 116 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్‌లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.…