Site icon NTV Telugu

Rashmika New Role : తొలిసారి ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న రష్మిక

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika New Role : గతేడాది పుష్పతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఉత్తరాదిలో కూడా ఈ భామకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించిన గుడ్ బై ఈ మధ్యే రిలీజైంది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం `మిషన్ మజ్ను`లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Read Also: Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్‌లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన

`మిషన్ మజ్ను` సినిమాలో మల్హోత్రా, రష్మిక కాంబినేషన్ పై హైప్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇండియా- పాకిస్తాన్ వార్ సమయంలో నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. `షేర్షా` తరహాలోనే `మిషన్ మజ్ను` కూడా థియేట్రికల్ విడుదల లేకుండా నేరుగా జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది.

Read Also: Balakrishna: బాలకృష్ణ బృందానికి రోడ్డు ప్రమాదం.. నలుగురు ఆర్టిస్టులకు గాయాలు

అయితే ఈ సినిమాలో రష్మిక ఛాలెంజింగ్ రోల్ చేయనున్నట్లు సమాచారం. తొలిసారిగా రష్మిక అంధ యువతి పాత్రలో నటించింది. అంధురాలిగా నటించేందుకు రష్మిక బాగా కష్టపడాల్సి వచ్చిందట. సెట్స్ పైకి రాకముందు రష్మిక చాలా మందిని పరిశీలించారని టాక్. రష్మిక మందన్న కిర్రాక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ రంగంలో తన కెరీర్ ను ఆరంభించింది. అల్లు అర్జున్ తో `పుష్ప 2- ది రూల్`పై దృష్టి సారించనుంది. అలాగే రణబీర్ కపూర్ సరసన `యానిమల్`లోను కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version