Rashmika: రష్మికను బ్యాన్ చేసిన ఇండస్ట్రీ.. ఇక తనకు ఆ సినిమాలే దిక్కా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika: రష్మిక మందన్నా ఈ మధ్య కాలంలో సంచలనంగా మారింది. అమ్మడు సినిమాల విషయంలో కాకుండా తాను చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లోకి ఎక్కింది. తన మాతృభాష అయిన కన్నడ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకుంది. దీంతో అక్కడి వారు రష్మికంటే అంతెత్తుకు ఎగురుతున్నారు. సక్సెస్ రాగానే కళ్లు నెత్తికెక్కాయంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆమెను బ్యాన్ చేశామంటూ ట్వీట్ చేస్తున్నారు. కన్నడ కిర్రాక్ పార్టీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఛలో, గీతాగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు హిట్స్‌తో కెరీర్ లో దూసుకుపోయారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకున్నారు. ఇకపోతే కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ నెట్టింట ఇటీవల తెగ ట్రోలింగ్ జరుగుతోంది.
Read Also: VeeraSimha Reddy :శివాలెత్తిస్తోన్న ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సింగిల్!
Also Read
- LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
అసలు కారణం ఏంటంటే..
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘కాంతార’. అయితే ఇంతవరకూ ఈ సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పిందీ ఈ భామ. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్ బ్యానర్లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ సినిమా బ్యానర్ కూడా తెలీదా? సో కాల్డ్ బ్యానర్ అని యాక్ట్ చేసి చెప్పడం ఎందుకు? అంత యాటిట్యూడ్ అవసరమా? అంటూ కన్నడిగులు మండిపడ్డారు. అటు కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్ చేయనున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Ashok Hotel: త్వరపడండి.. అమ్మకానికి చారిత్రాత్మక అశోకా హోటల్
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022
తాజావార్తలు
-
LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!