రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ కన్నడ బ్యూటీ తన రెండో సినిమా అయిన ‘గీతా గోవిందం’తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అందరికి తెగ నచ్చేసింది.ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ ను కొట్టేసింది రష్మిక . ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి మరో బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం . జర హట్కె జర బచ్కె సినిమాతో హిట్ సాధించిన విక్కీ కౌశల్ తన తరువాత సినిమాను ఆ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉత్కర్‌తోనే చేస్తున్నాడు. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు సమాచారం.. మరాఠి చారిత్రాత్మక నవల ఆధారంగా చావా సినిమా రూపొందనున్నట్లు సమాచారం.. పాన్ ఇండియా లెవల్లో కాస్త ఎక్కవ బడ్జెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.ప్రస్తుతం రష్మిక పుష్ప 2 తో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాను చేస్తుంది. ఇటీవలే యానిమల్‌లో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా తెలుగులో నితిన్‌తో ఓ సినిమా చేయబోతుంది.. అలాగే రష్మిక రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక.ఈమె చేస్తున్న సినిమాలు భారీ హిట్ కనుక సాధిస్తే రష్మిక కు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.