బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. అలియా యాక్టింగ్, కథల ఎంపిక అద్భుతంగా ఉంటుందన్నారు. జిగ్రా సినిమా అద్భుతంగా ఉందని, అలియా ఇరగదీసిందని పేర్కొన్నారు. వాసన్ బాలా మేకింగ్ చాలా బాగుందని రష్మిక చెప్పుకొచ్చారు. అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు.
Also Read: Shakib Al Hasan: ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నా: షకిబ్
నేడు జిగ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. సినీ తారల కోసం ముంబైలో స్పెషల్ షో వేశారు. ఈ షోకు రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. సినిమా చూసిన ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ‘జిగ్రా సినిమా చూశా. అద్భుతంగా ఉంది. ఆర్టిస్ట్స్, చిత్ర బృందాన్ని హత్తుకుని.. మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి థాంక్యూ. వేదాంగ్ రైనా బాగా నటించాడు. అతడు మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. రాహుల్ సర్‌ప్రైజ్ చేశాడు. నీకు, ఈ సినిమాలోని పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్ బాలా మేకింగ్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు’ అని రష్మిక రాసుకొచ్చారు. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రానా దగ్గుబాటి తెలుగులో జిగ్రాను విడుదల చేశారు.