కర్ణాటకలో అరుదైన ఒంటి కన్ను నాగుపాము తారపడింది. కార్వార్ తాలూకాలోని కద్రాలో అత్యంత అరుదైన ఒంటికన్ను (ఒక్క కన్ను) నాగుపాము కనిపించింది. దీంతో అధికారులు దాన్ని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. కార్వార్ తాలూకా మల్లాపూర్‌లోని లక్ష్మీనగర్‌లోని ఆకాషా ఎన్.చౌగ్లే ఇంటి సమీపంలో 4.5 అడుగుల పొడవున్న నాగు పాము కనిపించింది. దీంతో స్థానికులు కద్రా అటవీ డివిజన్ ఫారెస్ట్ వాచర్ బిలాల్ షేక్‌కు ఫోన్ చేశారు.
Also Read : Bandi Sanjay : పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రు
వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మండల అటవీ అధికారి లోకేష్ పటానాకర్ ఆధ్వర్యంలో నాగు పామును సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. చౌగ్లే ఇంటి దగ్గర రక్షించిన నాగుపాము ఒక కన్ను కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి ఒంటికన్ను నాగుపాము కనిపించడం చాలా అరుదు. ఈ నాగుపాముకు కంటిగుడ్డు మాత్రమే ఉంటుంది.
Also Read : Nandamuri Tarakaratna: అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి
కొన్ని సందర్భాల్లో, ముంగిసతో పోట్లాడినప్పుడు పాములు ఒక కన్ను కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలుకలు కుట్టడం వల్ల కూడా ఇలా జరుగుతుందని జీవవైవిధ్య పరిశోధకుడు మోజునాథ్ ఎస్ .నాయక్ చెబుతున్నారు. ఒక కంటి చూపు కోల్పోవడం పాముల జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు.
Also Read : Today (20-02-23) Stock Market Roundup: ఏడు శాతం పడిపోయిన CIPLA షేర్లు
అవి ప్రకృతిలో సాధారణ జీవితాన్ని గడపగలుగుతాయి. నాగుపాము సంభోగం కాలం కావడంతో నాగుపాములు మరింత చురుకుగా ఉంటాయి. ఆడ నాగుపాము ఉన్న ప్రదేశం చుట్టూ రెండు నాగుపాములు ఉండే అవకాశం ఉందన్నారు. ఇటీవల లక్ష్మీనగర్ కు చెందిన రాము అనే వ్యక్తి ఇంట్లో పక్షం రోజులుగా రెండు పాములు కనిపించడంతో.. వాటిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఎట్టకేలకు, ఫారెస్ట్ వాచర్ బిలాల్ షేక్ 4 గంటల నిరంతర ఆపరేషన్ తర్వాత జంట నాగుపాములను సురక్షితంగా రక్షించగలిగారు.