ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది.మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే రామ్ కు భాగ్యశ్రీ మధ్య ఆన్ స్క్రీన్ లవ్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లవ్ కూడా స్టార్ట్ అయిందని గత కొంతకాలంగా న్యూస్ వినిపిస్తున్నాయి.
Also Read : NTRNeel : షూటింగ్ కు బ్రేక్ దర్శకునికి.. హీరోకి చెడిందా.?
ఇప్పటికె ఈ సినిమా నుండి వచ్చిన ఈ ఇద్దరి పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ వార్తలపై రామ్ స్పందించాడు. రామ పోతినేని తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్నాడు. జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఆంధ్ర కింగ్ అని పెట్టావ్ మరి తెలంగాణా క్వీన్ ఎవరు, అపార్ట్మెంట్ లో సోలో గా ఉంటున్నావ్ ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అని రామ్ ను ప్రశ్నించాడు చౌమామ. అందుకు బదులుగా రామ్ బదులిస్తూ ” నా లైఫ్ అంతా రామ్ అలా చేసాడంట, అన్నాడంట ఇలా వెళ్తుంది. ఇక రీలేషన్షిప్స్ విషయానికి వస్తే నేను ఎప్పుడు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాను. సో అది పర్సనల్ అని అన్నాడు. అయితే భాగ్యశ్రీ కేవలం హీరోయిన్ మాత్రమేనా లేక ఇంకేమైనా ఉందా అని మరోప్రశ్న వేశాడు జగ్గు భాయ్. కానీ ఈ ప్రశ్నకు నవ్వుతూ ఊరుకున్నాడు రామ్. దాంతో రామ్ – భాగ్యశ్రీ లవ్ అనేది ఆల్మోస్ట్ కన్ఫమ్ అని రామ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. స్వీట్ బాయ్ రామ్ – రోజ్ బ్యూటీ భాగ్యశ్రీ జోడి బాగుంటుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.