Rapid Rail: బుల్లెట్ వేగం, విలాసవంతమైన సీట్లు, హైటెక్ ఫీచర్లు.. ర్యాపిడ్ రైలు అదుర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapid Rail: ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్)ను అక్టోబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి సామాన్యులు ఈ రైలులో ప్రయాణించవచ్చు. ప్రజలు దాని కోచ్‌లలో కూర్చున్నప్పుడు విమానంలో కూర్చున్న అనుభూతిని పొందుతారు. అలాంటి ఏర్పాటు ఆ రైలులో ఏర్పాటు చేశారు. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండాఈ సీట్లు కూడా వంగి ఉంటాయి. పెద్ద కిటికీలతో కూడిన హైటెక్ కోచ్‌లలో డిజిటల్ స్క్రీన్‌లు ఉంటాయి. రైలు మార్గంలో ప్రయాణీకులకు రైలు ప్రస్తుత వేగాన్ని చూపుతాయి.
ప్రతి రేక్‌లో ఆరు కోచ్‌లు, ఒక ప్రీమియం, ఐదు స్టాండర్ట్ కోచ్ లను కలిగి ఉంటాయి. ప్రీమియం కోచ్‌లకు ఎక్కువ ఛార్జీలు ఉంటాయి. స్టాండర్డ్ కోచ్‌లలో ఒకటి మహిళలకు కేటాయించబడుతుంది. ఉద్యోగుల్లో 50 శాతానికి పైగా మహిళలు ఉంటారు. స్థానిక నివాసితులకు ఉపాధి కల్పించే నిమిత్తం ఢిల్లీ – మీరట్ మధ్య నివసించే ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రీమియం టిక్కెట్లు ఉన్న వారి కోసం స్టేషన్లలో వెయిటింగ్ లాంజ్ కూడా ఉంటుంది. ప్రయాణికుల కోసం మొదటి రైలు శనివారం నడుస్తుంది. ప్రారంభంలో దాని ఫ్రీక్వెన్సీ 15 నిమిషాలు ఉంటుంది. ఒక్కో స్టేషన్‌లో రైళ్లు 30 సెకన్ల పాటు ఆగుతాయి.
Also Read
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!

ఈ రైలు 160 కి.మీ వేగం
RRTS సాధారణ రైల్వే వ్యవస్థ, మెట్రో నెట్‌వర్క్ రెండింటి నుండి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట ఆపరేటింగ్ వేగం కలిగి ఉన్న మొదటి రైల్వే వ్యవస్థ. మార్గంలో 14 స్టేషన్లు ఉంటాయి. సగటు వేగం గంటకు 100 కి.మీ. కారిడార్‌లోని 17 కిలోమీటర్ల పొడవైన సాహిబాబాద్ నుండి దుహై డిపో సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందులో మొత్తం ఐదు స్టేషన్లు ఉన్నాయి – సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో. ఈ దూరాన్ని అధిగమించడానికి 15-17 నిమిషాలు పడుతుంది.

ప్రధానమంత్రి 2019లో శంకుస్థాపన
రూ.30,274 కోట్లతో నిర్మించనున్న ఈ కారిడార్ మొత్తం 82 కి.మీ పొడవుతో ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ స్టేషన్ నుంచి మీరట్‌లోని మోదీపురం వరకు సాగుతుంది. మీరట్ – ఢిల్లీ మధ్య మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒకటిన్నర గంట, లోకల్ రైలులో రెండు గంటలు పడుతుంది. అయితే RRTS 55-60 నిమిషాలు మాత్రమే పడుతుంది. మొత్తం విభాగం జూన్ 2025లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2019 మార్చి 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

RapidX రైలు దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు అవుతుంది. వీటిలో సౌకర్యవంతమైన సీట్లు (కుషన్ సీటింగ్), నిలబడేందుకు విశాలమైన స్థలం, లగేజీ ర్యాక్, సీసీ కెమెరాలు, ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జింగ్ ఉంటాయి. ఆటో కంట్రోల్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు ఉంటాయి. ప్రతి రైలులో మ్యాప్ ఉంటుంది. దీంతో ప్రయాణికులకు సాయం అందుతుంది.
తాజావార్తలు
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!