NTV Telugu Site icon

Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..

Jharkhand

Jharkhand

జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్‌తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హజారీబాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ కుమార్ సింగ్, సబ్ డివిజనల్ ఆఫీసర్ (SDO) మరియు ఇతర అధికారులతో కలిసి విచారణను పర్యవేక్షించేందుకు ఆసుపత్రికి వచ్చారు. విచారణలో భాగంగా.. ఫోరెన్సిక్ బృందాలను పిలిపించారు. పారిపోయిన దోషిని పట్టుకోవడానికి ఆ ప్రాంతం అంతటా పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Read Also: Wayanad landslides: 130 మంది జాడ మిస్సింగ్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు షాహిద్ అన్సారీని ధన్‌బాద్ జైలు నుంచి హజారీబాగ్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతనిపై ధన్‌బాద్‌లో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక కేసు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద ఉల్లంఘనలతో సహా అనేక తీవ్రమైన నేరాలు అభియోగాలు ఉన్నాయి. మరొకటి హత్య, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులో ఉన్నాడు. ఈ క్రమంలో.. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

Read Also: CM Chandrababu: టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలి..

కాగా.. దోషి అన్సారీ శరీరం కుడి వైపున తిమ్మిరిలు వస్తున్నాయని.. గత 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతను AIIMSలో చికిత్స చేయించాలని కోరగా, షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే.. మెడికల్ కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా, అన్సారీ సెక్యూరిటీపై దాడి చేసి బయటకు పారిపోయినట్లు కనిపించింది. అతను తప్పించుకునే సమయంలో ఆసుపత్రి లోపల భద్రతా సిబ్బంది ఎవరూ లేరు. కాగా.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Show comments