Site icon NTV Telugu

Rao Bahadur: మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Rao Bahadur Teaser

Rao Bahadur Teaser

Rao Bahadur: టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సత్యదేవ్‌. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైకలాజికల్ డ్రామా జనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సత్యదేవ్ టైటిల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘రావు బహదూర్’ సినిమా మే 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు.

READ ALSO: Eggs for Women: గుడ్డు వెరీ గుడ్డే.. కానీ, మహిళలు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..?

నిజానికి ఇది సత్యదేవ్‌కు మాత్రమే కాదు, మహేష్ బాబు నిర్మాణ బృందానికి కూడా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుందని సినీ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే సత్యదేవ్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. వృద్ధుడి గెటప్‌లో అద్భుతంగా కనిపించిన ఆయన.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని అభిమానులు మెచ్చుకున్నారు. తర్వాత రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తుండగా, A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. దీపా థామస్, వికాస్ ముప్పల, బాల పరసర్, ఆనంద్ భారతి, కునాల్ కౌశిక్, తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తు్న్నారు. తర్వలో చిత్రం బృందం థియేటర్స్‌లోకి ఏ డేట్‌న రాబోతుందో వెల్లడించనుంది.

READ ALSO: Calcium-Rich Foods: పాల కంటే ఎక్కువ కాల్షియం కావాలా? అయితే నువ్వులను ఇలా వాడి చూడండి!

Exit mobile version