Dhurandhar: రణ్‌వీర్ సింగ్ నటించిన “ధురంధర్” బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. నాలుగో వారాలను చేరుకున్నప్పటికీ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో శనివారం రోజున ఈ చిత్రం రూ.20.9 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్ రూ.706.40 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, విడుదలైన కేవలం 23 రోజుల్లోనే ధురంధర్ రూ.1,026 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటేసింది. ఇది సినిమా కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది.
READ MORE: Tamil Cinema 2025 : స్టార్స్ ను సైడ్ చేసి చిన్న సినిమాలను ఆదరించిన తమిళ తంబీలు
ట్రేడ్ వర్గాల ప్రకారం.. శనివారం రోజు హిందీ వెర్షన్‌కు మొత్తం ఆక్యుపెన్సీ 38.48 శాతంగా నమోదైంది. ఉదయం షోలలో 20.54 శాతం, సాయంత్రం, రాత్రి షోలలో వరుసగా 45.34 శాతం, 42.27 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ స్థిరమైన విజయంతో ధురంధర్ ఇప్పటికే ప్రభాస్ నటించిన “కల్కి 2898 ఏడీ”ని భారత బాక్సాఫీస్ వద్ద దాటేసింది. కల్కి సినిమా భారత్‌లో తన ప్రస్థానాన్ని రూ.646.31 కోట్ల వద్ద ముగించింది. ఇక ధురంధర్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” కలెక్షన్లకు దగ్గర అవుతోంది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,055 కోట్ల వసూళ్లు సాధించింది. అదేవిధంగా, హిందీ వెర్షన్‌లో ప్రస్తుతం రూ.812.14 కోట్ల కలెక్షన్ ఉన్న “పుష్ప 2” రికార్డును కూడా అధిగమించే దిశగా ధురంధర్ దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. “కాంతారా: చాప్టర్ 1”, “ఛావా” వంటి భారీ చిత్రాలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. కార్తిక్ ఆర్యన్ నటించిన క్రిస్మస్ రిలీజ్ “తూ మేరా మైన్ తేరీ మైన్ తేరా తూ మేరీ” నుంచి పోటీ ఉన్నప్పటికీ, ధురంధర్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
READ MORE: Tamil Cinema 2025 : స్టార్స్ ను సైడ్ చేసి చిన్న సినిమాలను ఆదరించిన తమిళ తంబీలు