నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న థియేటర్లలో కి విడుదల అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది .అయితే కలెక్షన్లు కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సినిమా సీరియస్ గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కు నాగశౌర్య యాక్టింగ్ అలాగే సత్య కామెడి హైలెట్ గా నిలిచాయి.. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేది ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని ఆగస్టు 4 నుంచి ఓటీటీలో అందుబాటు లో ఉంచనున్నట్లు సమాచారం.రంగబలి సినిమా విడుదలయి కనీసం నెలరోజులు కూడా పూర్తి కాకుండా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది.. పవన్ బాసంశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా లో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మలయాళ నటుడు షైమ్ టాన్ చాకో విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. నాగ శౌర్య సినిమా కెరీర్ లోనే ఛలో అద్భుత విజయం సాధించింది. కానీ నాగ శౌర్య చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో హిట్ కాలేదు. ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.రంగబలి సినిమాతో భారీ హిట్ సాధించాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలి అనే సంధిగ్ధం లో వున్నాడు.