Akash Deep Debut in IND vs ENG 4th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచిలో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆరంభం కానున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్, రెహాన్ అహ్మద్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులోకి తీసుకుంది. ఇక భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు.
ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఈ టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. గత మూడు టెస్టుల మాదిరే.. ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్–18, జియో సినిమాలో ఈ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Also Read: Bramayugam Review: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘భ్రమ యుగం’ రివ్యూ!
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), టామ్ హార్ట్‌లీ, ఓలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
🚨 A look at #TeamIndia‘s Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/HxEpkWhcwh
— BCCI (@BCCI) February 23, 2024