Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Ranchi Shocker Hotel Owner Shot Dead After Serving Wrong Biryani

Ranchi: వెజ్ బిర్యానీకి బదులు నాన్‌వెజ్ బిర్యానీ వడ్డన.. చివరకు?

Published Date :October 19, 2025 , 2:28 pm
By Kothuru Ram Kumar
Ranchi: వెజ్ బిర్యానీకి బదులు నాన్‌వెజ్ బిర్యానీ వడ్డన.. చివరకు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ranchi: జార్ఖండ్‌లోని రాంచీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఒక హోటల్ యజమాని తన రెస్టారెంట్‌లోనే కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఓ వ్యక్తి రెస్టారెంట్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. పొరపాటున నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించడంపై జరిగిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. కాంకే – పిథోరియా రోడ్డులో ఉన్న ‘చౌపాటీ’ అనే రెస్టారెంట్‌కు చెందిన యజమాని విజయ్ కుమార్ ను శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. హత్య సమాచారం అందుకున్న వెంటనే రాంచీ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పుష్కర్, కాంకే పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు రాంచీలోని ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. అలాగే సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.

Revanth Reddy: గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!

పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి ఒక కారులో నలుగురు యువకులు సేఫ్ చౌపాటీ రెస్టారెంట్‌కు వచ్చారు. రెస్టారెంట్‌లోకి రాగానే వారు హోటల్ యజమాని విజయ్ కుమార్‌కు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే, యజమాని పొరపాటున వారికి వెజ్ బిర్యానీకి బదులు నాన్‌వెజ్ బిర్యానీ వడ్డించారు. ఈ పొరపాటుకు ఆగ్రహించిన యువకులలో ఒకరు, తన నడుము నుంచి తుపాకీ తీసి హోటల్ యజమాని విజయ్ కుమార్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. హత్య జరిగిన వెంటనే నిందితులంతా కారులో పిథోరియా మీదుగా పారిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది.

K Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్

స్థానికులు వెంటనే హోటల్ యజమాని విజయ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేవలం బిర్యానీ ఆర్డర్ పొరపాటు కారణంగానే ఈ హత్య జరిగిందా..? లేక దీని వెనుక మరేదైనా పాత పగ..? లేదా వ్యక్తిగత వైరం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biryani murder
  • Chowpatty Ranchi owner shot
  • Crime News
  • Jharkhand
  • Ranchi

తాజావార్తలు

  • Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions