NTV Telugu Site icon

Kuwait Fire Accident: కొడుకు కువైట్కు వెళ్లడం ఇష్టం లేదు.. మృతుడి తల్లితండ్రుల రోదన

Ranchi

Ranchi

రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ముబారక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఇంట్లో దేనికీ లోటు లేదని అన్నాడు. తన కొడుకు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం తనకు, తన భార్యకు ఇష్టం లేదని తీవ్రంగా విలపిస్తున్నారు. ఎలాగైనా కువైట్ కు వెళ్లి జీవితలంలో మంచి స్థాయిలో ఉన్న అలీ కల.. కల గానే మిగిలిపోయిందని తండ్రి తీవ్ర దు:ఖంతో చెబుతున్నాడు. అయితే.. తన కొడుకు చనిపోయినట్లు తల్లికి ఇంకా తెలియదు.

Ganja Gang Hulchul: కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి

అగ్నిప్రమాద ఘటనకు ముందు.. మృతుడు అలీ కువైట్ నుండి తన కుటుంబంతో రోజు ఫోన్లో మాట్లాడుతుండే వాడని.. జూన్ 12 తర్వాత అకస్మాత్తుగా కమ్యూనికేషన్ ఆగిపోయిందని తండ్రి చెప్పాడు. దీంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యమన్నాడు.అలీ వాట్సాప్ ఆన్‌లైన్‌లో కూడా లేడని తెలుసుకుని.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. సౌదీ అరేబియాలో ఉన్న అలీ మామ తన పాస్‌పోర్ట్ వివరాలను కువైట్‌లోని ఒక తెలిసిన వ్యక్తి పంపించగా.. అతను ఆసుపత్రిలో మరణించి ఉన్నాడని చెప్పాడన్నాడు. అలీ తండ్రి వ్యాపారం చేస్తుంటాడు. అలీకి తల్లి, ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. అతని సోదరుడు ఆదిల్ హుస్సేన్ మక్కాలో నివసిస్తుండగా, అతని సోదరి నౌషీన్ టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతుంది.

Health Tips : పెరుగును వీటితో కలిపి అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?

కువైట్ అగ్నిప్రమాదానికి గురైన 49 మందిలో 45 మంది భారతదేశానికి చెందినవారు ఉన్నారు. కేరళ నుండి 23 మంది, తమిళనాడు నుండి ఏడుగురు, ఉత్తర ప్రదేశ్ నుండి ఒక్కొక్కరు ముగ్గురు.. ఒడిశా నుండి ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు.