రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు.