Site icon NTV Telugu

Ramayana: రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో “రామాయణం”.. ట్రైలర్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

Ramayana

Ramayana

Ramayana: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రామాయణం” ట్రైలర్ శాన్ డియాగో కామిక్ కాన్ 2026లో విడుదల కానుందని సినిమా బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

READ MORE: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక పరిమాణం.. ఒకేసారి 208 మావోల లొంగుబాటు

కామిక్ కాన్ ఈవెంట్లు కేవలం శాన్ డియాగోలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతాయి. అమెరికాలోనే, న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో కామిక్ కాన్ ఈవెంట్లు జరుగుతాయి. ఈ ఈవెంట్లలో ప్రధానంగా కామిక్ పుస్తక ఆధారిత కంటెంట్‌పై దృష్టి కేంద్రీకరిస్తారు. శాన్ డియాగో కామిక్ కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ సంస్కృతి కార్యక్రమం. ఇది కామిక్స్, వీడియో గేమ్‌లు, యానిమేషన్ కంటెంట్, టీవీ షోలు, చిత్రాలపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ ప్రీమియర్ అయ్యే సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారు. సైన్స్ ఫిక్షన్, యానిమేషన్ లేదా ఫాంటసీ ఆధారంగా సినిమా ప్రాజెక్టులు ఈ ప్లాట్‌ఫామ్ కోసం ఆశిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అన్ని శాన్ డియాగో కామిక్ కాన్‌లో రామాయణం ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

READ MORE: Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని

Exit mobile version