Ramayana: రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో “రామాయణం”.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రామాయణం” ట్రైలర్ శాన్ డియాగో కామిక్ కాన్ 2026లో విడుదల కానుందని సినిమా బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
READ MORE: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక పరిమాణం.. ఒకేసారి 208 మావోల లొంగుబాటు
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కామిక్ కాన్ ఈవెంట్లు కేవలం శాన్ డియాగోలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతాయి. అమెరికాలోనే, న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో కామిక్ కాన్ ఈవెంట్లు జరుగుతాయి. ఈ ఈవెంట్లలో ప్రధానంగా కామిక్ పుస్తక ఆధారిత కంటెంట్‌పై దృష్టి కేంద్రీకరిస్తారు. శాన్ డియాగో కామిక్ కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ సంస్కృతి కార్యక్రమం. ఇది కామిక్స్, వీడియో గేమ్‌లు, యానిమేషన్ కంటెంట్, టీవీ షోలు, చిత్రాలపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ ప్రీమియర్ అయ్యే సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారు. సైన్స్ ఫిక్షన్, యానిమేషన్ లేదా ఫాంటసీ ఆధారంగా సినిమా ప్రాజెక్టులు ఈ ప్లాట్‌ఫామ్ కోసం ఆశిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అన్ని శాన్ డియాగో కామిక్ కాన్‌లో రామాయణం ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
READ MORE: Mary Millben: రాహుల్‌గాంధీకి ఆ చతురత లేదు.. మోడీపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అమెరికా గాయని
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!