బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ’ యానిమల్ ‘ డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.. ఈ క్రమంలో నవంబర్ 27 న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు బాలీవుడ్, తెలుగు సినీ ప్రముఖులతో వేదికను పంచుకున్న తారలతో నిండిపోయింది.
దర్శకధీరుడు దర్శకుడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన తారలు రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో కలిసిపోయారు.. ఈ ఈవెంట్ లో రణభీర్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు.. అతను ధరించిన జాకెట్ పై అందరి చూపు పడింది.. మస్టర్డ్-కలర్ ప్రాడా బ్లేజర్ ధరించి, అతను తన కూల్ లుక్ కోసం ప్రశంసలు పొందాడు. అయితే, ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతని స్వెడ్ బాంబర్ జాకెట్ ధర ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది. తాజాగా దీని ధర రూ. 4.35 లక్షలు అని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఇకపోతే సినిమా విడుదల అవ్వడానికి ఒక్కరోజే టైం ఉంది.. ఈ క్రమంలో హీరో రణబీర్ కపూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా తన భార్య ఆలియా భట్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.’యానిమల్’ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య ఆలియా నుంచి చాలా సపోర్టు లభించిందని రణబీర్ కపూర్ తెలిపారు.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..