మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్`సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. `బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.మెగాస్టార్ 156 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ మూవీలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన విలన్‌గా కనిపిస్తారని తెలిసింది.కానీ లేటెస్ట్ సమాచారం మేరకు.. ఈ మూవీ నుంచి రానా తప్పుకున్నారట. డేట్స్ ఇష్యూ వల్ల సినిమా చేయలేకపోతున్నట్టు సమాచారం.. దీంతో రానా స్థానంలో మేకర్స్ మరో నటుడిని బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు.
బాలీవుడ్‌లో కునల్ కపూర్ విలన్ పాత్రలతో మరియు విలక్షణ పాత్రలతో ఎంతగానో మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన్ని చిరంజీవి సినిమా కోసం ఎంపిక చేశారట. అంతేకాదు ఏకంగా సెట్‌లోకి కూడా అడుగు పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుందని, ఇందులో కునల్ పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఆయనపై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు వశిష్ట. ఇదిలా ఉంటే చిరంజీవి త్వరలోనే ఈ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం చిరు లేని సీన్లు షూట్ చేస్తున్నారట.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష ఫైనల్ అయ్యినట్లు తెలుస్తుంది.ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లకి ఈ సినిమాలో స్కోప్ ఉందని సమాచారం.ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేయనున్నారు..ఎప్పుడు చూడని సరికొత్త విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ సినిమాగా దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు