ఆర్టీసీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ అన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారని, విలీనం డిమాండ్ అసంబద్ధమైనది అని కేసీఆర్ చెప్పారన్నారు. విలీనం డిమాండ్ చేసే రాజకీయ పార్టీలకు ఏం తెలియదు అని మాట్లాడారని, ఇప్పుడు ఎన్నికల కోసం యు టర్న్ తీసుకున్నాడని ఆయన అన్నారు.
Also Read : 2000Note: షాకింగ్ న్యూస్.. 21 లక్షల కట్టల 2000 నోట్లు ఎక్కడ?
గతంలో ఆర్టీసి సమ్మె సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటే 38 మంది కార్మికులు చనిపోయేవారా అని, ఆర్టీసీ బకాయిలపై కేసీఆర్ సమాధానం చెప్పడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ విలీన ప్రకటన వెనుక ఆర్టీసీ ఆస్తులను అమ్మే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ విలీనం ప్రకటనతో కార్మికులు పాలాభిషేకం చేయలేదని, కేవలం స్థానిక ఎమ్మేల్యేలు హడావిడి చేశారని, సబ్ కమిటీ లో కార్మికులకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆయన అన్నారు. సమ్మె విరమించిన సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదని ఆయన ప్రశ్నించారు. డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ ఎందుకు ఎత్తేయడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ విలీనం పై 2018 మ్యానిఫెస్టోలో పెట్టామని, ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కుట్రల కు బలి కావద్దని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Ayushmann Khurana: ఈ హీరో చాలా అందంగా ఉంది…