తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ పోరు రచ్చ కెక్కిన విషయం తెలిసిందే. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ సభ నిర్వహించగా ఆ సభలో పాల్గొన్న నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. అద్దంకి దయాకర్ లాంటి వాళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిపై కామెంట్లు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం.. అద్దంకి దయాకర్‌వుకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనను రేవంత్ రెడ్డి అవమానించారు.. తనకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో మరోసారి హస్తం పార్టీ ముసలం మచ్చట రచ్చకెక్కింది.. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు 7 గ్రామాల మీదుగా 15 కిలోమీటర్లు మేర ఆజాజ్ క గౌరవ యాత్ర సాగనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా.. ఈ యాత్రలో రాష్ట్ర నాయకత్వ పాల్గొంటుందని వెల్లడించారు. అయితే.. చౌటుప్పల్ లో సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుందని, కాంగ్రెస్ రాష్ట్ర అగ్ర నాయకులు అందరూ ఈ యాత్ర లో పాల్గొంటారని స్పష్టం చేశారు. 16,18,19 తేదీల్లో నియోజకవర్ లోని ప్రతి మండలంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 20వ తేడీ నుండి నియోజకవర్గంలోని 175 గ్రామాలలో సీఎల్పీ రాష్ట్ర నాయకత్వం వర్క్ చేస్తుందని.. ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ నిర్వహిస్తామన్నారు. అయితే.. స్టార్ట్ కాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.