NTV Telugu Site icon

Ram Mandir: అయోధ్యలో రాంలాలా ప్రాణప్రతిష్ట రోజున 50కి పైగా దేశాల్లో రామోత్సవం..

Ayodhya

Ayodhya

Ramlala Pran Pratishtha: అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రపంచ విశ్వ హిందూ పరిషత్ విభాగం ఉన్నత అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 50 కంటే ఎక్కువ దేశాల్లో 500 కంటే ఎక్కువ విభిన్న సామూహిక ఆచారాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

Read Also: Rangareddy Crime: దారుణం.. 20 రూపాయల కోసం కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు..

కాగా, జనవరి 22వ తేదీన అమెరికాలో 300, బ్రిటన్‌లో 25, కెనడా, ఆస్ట్రేలియాలో 30, మారిషస్‌లో 100, జర్మనీలో 10కి పైగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొన్ని దేశాల్లో హిందువుల జనాభా తక్కువగా ఉండగా.. ఐర్లాండ్ లాంటి దేశాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఊరేగింపులు కొనసాగుతున్నాయి. అలాగే, రామ్ ఆధారిత సెమినార్లు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ దేశాలలో స్థిరపడిన హిందువులను ఆహ్వానించడానికి అయోధ్య నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపిన అక్షతలు పంపిణీ చేయబడుతున్నాయి.

Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?

ఇక, విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మనకంటే ఎక్కువ ఉత్సాహం ఉందని ప్రపంచ విభాగాధిపతి స్వామి జ్ఞానానంద్ చెప్పారు. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించి.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం 100 మంది భారతీయులకు మాత్రమే విదేశాంగ శాఖ ద్వారా ప్రాణ ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం దొరికింది. అయితే, 50కి పైగా దేశాల్లోని ఆలయాల్లో రామ్ లల్లా విగ్రహావిష్కరణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతే కాదు అక్కడి హిందూ సమాజం ఆలయాల్లో ధార్మిక వేడుకలను నిర్వహిస్తోంది. భారతదేశం నుంచి కొన్ని దేశాల్లో సమయంలో తేడాలు ఉంటాయి.. అలాంటి పరిస్థితిలో రికార్డ్ చేయబడిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సామూహికంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.