అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ఇవాళ్టి నుంచి అయోధ్యలో రామోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మన దేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకు పైగా కళాకారులు పాల్గొనబోతున్నారు. నేటి నుంచి రామ కథా పార్కులో రామకథ స్టార్ట్ అవుతుంది.