Ram Mandir: అయోధ్యలో రాంలాలా ప్రాణప్రతిష్ట రోజున 50కి పైగా దేశాల్లో రామోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramlala Pran Pratishtha: అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రపంచ విశ్వ హిందూ పరిషత్ విభాగం ఉన్నత అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 50 కంటే ఎక్కువ దేశాల్లో 500 కంటే ఎక్కువ విభిన్న సామూహిక ఆచారాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Rangareddy Crime: దారుణం.. 20 రూపాయల కోసం కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు..
Also Read
కాగా, జనవరి 22వ తేదీన అమెరికాలో 300, బ్రిటన్‌లో 25, కెనడా, ఆస్ట్రేలియాలో 30, మారిషస్‌లో 100, జర్మనీలో 10కి పైగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొన్ని దేశాల్లో హిందువుల జనాభా తక్కువగా ఉండగా.. ఐర్లాండ్ లాంటి దేశాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఊరేగింపులు కొనసాగుతున్నాయి. అలాగే, రామ్ ఆధారిత సెమినార్లు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ దేశాలలో స్థిరపడిన హిందువులను ఆహ్వానించడానికి అయోధ్య నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపిన అక్షతలు పంపిణీ చేయబడుతున్నాయి.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?
ఇక, విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మనకంటే ఎక్కువ ఉత్సాహం ఉందని ప్రపంచ విభాగాధిపతి స్వామి జ్ఞానానంద్ చెప్పారు. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించి.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం 100 మంది భారతీయులకు మాత్రమే విదేశాంగ శాఖ ద్వారా ప్రాణ ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం దొరికింది. అయితే, 50కి పైగా దేశాల్లోని ఆలయాల్లో రామ్ లల్లా విగ్రహావిష్కరణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతే కాదు అక్కడి హిందూ సమాజం ఆలయాల్లో ధార్మిక వేడుకలను నిర్వహిస్తోంది. భారతదేశం నుంచి కొన్ని దేశాల్లో సమయంలో తేడాలు ఉంటాయి.. అలాంటి పరిస్థితిలో రికార్డ్ చేయబడిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సామూహికంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!