Ramakuppam: రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్.. రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. కుప్పంలో 34 మంది టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఎన్‌కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తకు రామకుప్పం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ బెదిరించాడు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై బూతులతో విరుచుకుపడ్డాడు ఎస్ ఐ కృష్ణ. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా.. దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు.
Read Also: GT vs MI: గుజరాత్ పరుగుల సునామీ.. ముంబై లక్ష్యం ఎంతంటే?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అంతేకాదు.. కాల్చిపడేస్తానా కొడకా.. ఎన్‌కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తపై బెదిరింపులకు దిగాడు.. అయితే, ఎస్సై సిఫారసు మేరకు నెల రోజుల్లోనే ఏకంగా 34 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు సీఐ శ్రీధర్. మరో నలుగురిపై రౌడీషీట్లు పెట్టేందుకు సిద్దమయ్యాడు ఎస్ఐ. పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మాపై కేసులు పెడుతున్నారు.. మరి మేం ఫిర్యాదు చేస్తే.. ఎందుకు కేసులు పెట్టడంలేదని ఎస్సైని ఫోన్‌లో ప్రశ్నించాడు బాధితుడు.. ఇలాగే వ్యవహరిస్తే పీఎస్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నాడు.. దానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్సై.. నోటికి వచ్చిన బూతులతో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయింది. కాగా, గతంలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పిస్టల్ ఫైర్ చేసి ఎస్‌ఐ కృష్ణయ్య సస్పెండ్ అయినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..