Mumbai Indians Needs 208 Runs To Win Against Gujarat Titans: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అర్థశతకంతో రాణించడం.. డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో రాహుల్ తేవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్లు సహాయంతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది.
Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఐదు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలం 33 పరుగులే చేసింది. కానీ.. ఆరో ఓవర్ నుంచి జీటీ దూకుడు పెంచింది. అప్పటివరకూ ఆచితూచి ఆడిన శుభ్మన్, ఆ తర్వాతి నుంచి చెలరేగిపోయాడు. అయితే.. అర్థశతకం చేసుకున్నాక అతడు పెవిలియన్ చేరాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా (13) ఔటై నిరాశపరచగా.. శుభ్మన్ ఔటయ్యాక విజయ్ శంకర్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. 12.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. జీటీ 170 పరుగుల మైలురాయిని అయినా అందుకుంటుందా? అనే అనుమానం నెలకొంది. అప్పుడు క్రీజులో ఉన్న డేవిడ్, అనుభవ్.. ముంబై బౌలర్లపై దండయాత్ర చేశారు. ఎడాపెడా షాట్లతో బౌండరీలు బాదుతూ.. పరుగుల సునామీ సృష్టించారు. ఎలాంటి బంతులు వేసినా దంచి కొట్టారు.
Couple Revenge: దంపతుల ప్రతీకారం.. ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీకి భారీ నష్టం
ఇక చివర్లో తానూ ఏం తిక్కువ తినలేదన్నట్టు.. రాహుల్ తేవాతియా కూడా చెలరేగిపోయాడు. వచ్చి రాగానే తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సులతోనూ అదరగొట్టాడు. డేవిడ్, అనుభవ్, తేవాతియా దున్నేయడంతో.. గుజరాత్ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటేసి, 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్, జేసన్, మెరిడిత్, కార్తికేయ చెరో వికెట్ పడగొట్టారు. మొదట్లో పొదుపుగా బౌలింగ్ వేసిన ముంబై బౌలర్లు.. చివర్లో మాత్రం భారీ పరుగులు సమర్పించుకున్నారు.