ఒకరు అధికారదర్పంతో అస్తి కోసం సొంత బామ్మర్దినే హత్య చేయించారు. మరికొందరు అధికారబలం ఉందని సామాన్యులపై దాడులకు తెగబడ్డారు.స్థానిక మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొంతకాలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు నాయకుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కబ్జాలు,బెదిరింపులతో రామగుండం కార్పొరేషన్లో కొందరి ప్రజాప్రతినిధుల తీరు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది..
రామగుండం కార్పొరేషన్ నిత్యం సమస్యలకు నిలయంగా మారింది.అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై కంటే దాడులు, బెదిరింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్లో మహిళా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారి భర్తల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. మద్యం కోసం కొట్టడం ఇళ్లముందు బైక్ లు అడ్డుగా ఉన్నాయని దాడులు చేయించడం అధికారం ఉందని హత్యలు చేయించడం .. అక్కడి నాయకుల తీరుతో ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రామగుండం కార్పొరేషన్లోని 6వ డివిజన్ కార్పోరేటర్లు కాల్వ స్వరూప శ్రీనివాస్ స్వంత బామ్మర్ధినే హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసాడు. అధికారపార్టీ అండతో ఎలాగైనా బయటపడవచ్చని విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ సొంతబామ్మర్దినే హత్య చేయించినట్లు రుజువు కావడంతో కటకటాలపాలయ్యాడు.
మరోవైపు రామగుండం కార్పొరేషన్లోని మరో కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, ఇంకో కార్పొరేటర్ భర్త జలపతి టిబిజికేయస్ కార్మికసంఘం నాయకుడు పొలాడి శ్రీనివాస్ జువ్వాడి వెంకట్లు రోడ్డుపై బైక్ లు అడ్డుపెట్టారన్న నెపంతో ఇంటి యజమాని చందుపట్ల వేణుగోపాల్ అతని భార్య ప్రమీదపై మూకుమ్మడిగా దాడికి దిగారు.అడ్డువచ్చినవారిని సైతం కొట్టారు. మద్యంమత్తులో మహిళలు అనికూడా చూడకుండా నానా బూతులు తిడుతూ సామాన్యులపై రెచ్చిపోయారు..దీంతో ఆప్రాంతములోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపుచేసే ప్రయత్నం చేసినావారు వినని పరిస్థితి నెలకొంది.
దీంతో సేదేమీలేక గాయపడిన బాధితులను హాస్పిటల్ కి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు..దీంతో ఘటనపై స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తూ కార్పొరేటర్ ను ఇతర నాయకులపై పార్టీ నుండి సస్పెండ్ చేసిచేతులు దులుపుకొన్నారు. మరో కార్పొరేటర్ స్థానికంగా వుండే వైన్ షాపు సిబ్బందిని చితకబాదారు. మద్యం ఉచితంగా ఇవ్వలేదన్న కోపంతో దాడిచేసినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు..ఇలా స్థానిక ప్రజాప్రతినిధులపై అనేక ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారపార్టీ కావడంతో పెద్దల అండదండలతోనే పేట్రేగిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రామగుండం కార్పొరేషన్లో రోజురోజుకు పెరుగుతున్న ప్రజాప్రతినిధుల అక్రమాలు, దాడులపై చర్యలు తీసుకోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
Cordon Search: కూకట్ పల్లిలో కార్డన్ సెర్చ్.. అదుపులో ఫైనాన్స్ వ్యాపారి
