ఒకరు అధికారదర్పంతో అస్తి కోసం సొంత బామ్మర్దినే హత్య చేయించారు. మరికొందరు అధికారబలం ఉందని సామాన్యులపై దాడులకు తెగబడ్డారు.స్థానిక మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొంతకాలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు నాయకుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కబ్జాలు,బెదిరింపులతో రామగుండం కార్పొరేషన్లో కొందరి ప్రజాప్రతినిధుల తీరు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.. రామగుండం కార్పొరేషన్ నిత్యం సమస్యలకు నిలయంగా మారింది.అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై కంటే దాడులు, బెదిరింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ…