RAPO : రామ్ పోతినేని ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రాల విషయంలో వేగం పెంచారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ఆయన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. గత ఏడాది రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ప్లాప్ అయింది. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ పోతినేని ఫిక్స్ అయ్యారు. అందుకే ఒకేసారి రెండు విభిన్నమైన జోనర్లను ఎంచుకొని ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారు. కథలు పక్కాగా కుదిరితే, అందులో ఒకటి మార్చిలో, మరొకటి ఏప్రిల్ నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణను రామ్ సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్.
Also Read : OTT Crisis : నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..
Also Read
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
అందులో ఒక సినిమాకు దర్శకుడు కిషోర్ తిరుమల కథ అందిస్తున్నాడు. రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ రెడ్ సినిమాలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో లవ్ ఎమోషనల్ స్టోరీ రాబోతోంది. అయితే ఈ చిత్రానికి కిషోర్ తిరుమల కేవలం కథను మాత్రమే అందిస్తున్నారు, దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. రామ్ మార్క్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగనుంది. ఇక రామ్ కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ అంటే అది సూపర్ నేచురల్ థ్రిల్లర్. శ్రీ విష్ణు నటించిన ‘మృత్యుంజయ’ సినిమా దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కంటెంట్ పరంగా ఎంతో కొత్తగా ఉండే ఈ థ్రిల్లర్ రామ్ ఇమేజ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించబోతోందని టాక్. వేసవి నాటికల్లా ఈ రెండు సినిమాల హడావిడి మొదలుకానుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..