రామ్ తన 18 ఏళ్ల కెరీర్లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళ్తున్న కెరీర్‌ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జిటిక్ హీరో కెరీర్లో హిట్స్ అంటే.. దేవదాస్..రెడీ.. కందిరీగ.. ఇస్మార్ట్ శంకర్ వంటి నాలుగైదు హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్సాఫీస్ వద్ద లెక్క తప్నినా.. వరుస ఫ్లాపుల రికార్డ్‌ను క్రియేట్ చేస్తున్నాడు రామ్.
Also Read : Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్.. సినిమాలపై ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు
ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్‌తో కమ్‌బ్యాక్ అవుతాడనుకుంటే.. డిజాస్టర్ అయింది. సినిమాను వరల్డ్‌వైడ్ థియేటరికల్ రైట్స్‌ను 41 కోట్లకు అమ్మితే. .. 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఆమధ్య వచ్చిన లవ్‌స్టోరీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పరిస్థితి కూడా ఇంతే. బాక్సాఫీస్ వద్ద జాతకం ఏమాత్రం మారలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత క్యూట్ బాయ్ రామ్ కాస్తా.. రఫ్ లుక్‌లోకి వెళ్లిపోయాడు. రెడ్.. స్కంద.. డబుల్ ఇస్మార్ట్‌లోనూ ఇదే లుక్ మెయిన్టేన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని ఆంధ్రా కింగ్ తాలూకాతో లవర్‌బాయ్ లుక్‌లోకి వచ్చాడు. లుక్ ఛేంజ్ చేసినా.. ఫేట్ మాత్రం మార లేదు. నెక్ట్స్ మూవీతో అయినా..బలమైన కథతో వచ్చి హిట్ కొడతాడేమో చూడాలి మరి.