PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. అయితే ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతునే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా.. విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రమంలో జూన్ 4 లేదా జూన్ 25 తేదీల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు డేట్స్ పరిశీలించిన టీమ్ ఫైనల్‌గా జూన్ 25ను లాక్ చేసారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి శృతి హాసన్ స్టెప్పులేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుకున్న స్పెషల్ సాంగ్.. మరింత మాస్‌గా ఉంటుందని టాక్. మరి పెద్ది రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?