Game Changer : మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉండేవి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది.
Read Also:Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కీలక విషయాలు..
కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, భారీ బడ్జెట్ తో శంకర్ మార్కులోనే తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు. వసూళ్ల పరంగా ఏ చిత్రం టార్గెట్ రీచ్ కాలేకపోవచ్చు కానీ ఒక విషయంలో మాత్రం ఫెయిల్ కాలేదని చెప్పుకోవచ్చు.
Read Also:TVS King EV MAX: బ్లూటూత్ కనెక్టివిటీతో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 179KM రేంజ్!
ఈ చిత్రంలో శంకర్ మార్క్ మెసేజ్ ఉంది. ఒక ఐఏఎస్ అధికారికి ఉండే పవర్స్ ఆ పొలిటికల్ గేమ్ ని చూపించిన విధానానికి మాత్రం ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. దీనితో దేశంలో పలు చోట్ల స్కూల్స్ కి సంబంధించి విద్యార్ధులకి కూడా గేమ్ ఛేంజర్ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రభుత్వాధికారి ప్రేరణ కోసం వేస్తున్నారు. దీనితో రానున్న రోజుల్లో ఇలాంటివి వారికి ప్రేరణగా నిలుస్తాయని వారు అంటున్నారని టాక్. ఈ విషయంలో మాత్రం గేమ్ ఛేంజర్ సినిమాను ఒప్పుకోవాల్సిందే.