Upasana Kamineni post Special Pic on Valentine’s Day 2024: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా.. మెగా కోడలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు కోడలుగా కుటుంబ బాధ్యతలను, మరోవైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ మంచి గుర్తింపు పొందారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు ‘వాలెంటైన్ డే’ సందర్భంగా ఉపాసన కొణిదెల స్పెషల్ పోస్ట్ చేశారు.
‘వాలెంటైన్స్ డే’ 2024 సందర్భంగా ఉపాసన కొణిదెల అరుదైన ఫోటోను పంచుకున్నారు. తమ కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టుకి ఇన్ఫినిటీ, లవ్ సింబల్ జత చేశారు. ‘అంతులేని ప్రేమ’ అని ఉపాసన పేర్కొన్నారు. ఈ పోస్టుతో తనను రామ్ చరణ్ ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు వాలెంటైన్స్ డే విషెష్ చెబుతున్నారు.
Also Read: Valentines Night OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘వాలంటైన్స్ నైట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. 2010లో విడుదలైన ఆరెంజ్ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నాళ్లు ప్రేమలో ఉన్న చరణ్, ఉపాసనళ్లు.. ఇరు కుటుంబాల అంగీకారంతో 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వీరికి కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో క్లీంకార మెగా ఫ్యా మిలీలోకి అడుగుపెట్టింది. చరణ్ సినిమాలతో బిజీగా ఉండగా.. ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో బిజీగా ఉన్నారు.
♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW
— Upasana Konidela (@upasanakonidela) February 14, 2024