Site icon NTV Telugu

Ram Charan-Upasana : మెగా కవలల రాకతో ‘స్పెషల్’ ట్రీట్.. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే?

Ramcharan Upasana

Ramcharan Upasana

జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతొ మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభవార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో, తమ సంతోషాన్ని పంచుకుంటూ మెగా దంపతులు అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. ఆ బాక్స్‌లో ఉన్న ఈ కానుకల అన్‌బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి.

Also Read :  Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ మృతి.. కంటతడి పెట్టిన సుమ!

ఆ గిఫ్ట్ బాక్స్‌లో రెండు గిన్నెలు, రెండు స్పూన్లు… ఒక ప్లేట్ ఉన్నాయి. ఆ ప్లేట్‌పై పిల్లలు పుట్టిన తేదీ ’31-01-2026′ అని ముద్రించి ఉండటం విశేషం. దీనితో పాటు నోరూరించే స్వీట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కానుకల ధరపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. ఇవి స్వచ్ఛమైన వెండి వస్తువులు కాదని, ‘జర్మన్ సిల్వర్’తో చేసినవని సమాచారం. ఒక్కో సెట్ ధర సుమారు రూ. 300 నుండి రూ. 400 వరకు ఉంటుందని తెలుస్తోంది. ధర ఎంత అన్నది పక్కన పెడితే, తమ అభిమాన హీరో తన ఆనందాన్ని ఇలా పంచుకోవడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 

Exit mobile version