Ram Charan :చరణ్‌కి జోడిగా.. సుకుమార్ డబుల్ హీరోయిన్ ప్లాన్..రేసులో అనుపమ, రుక్మిణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘రంగస్థలం’ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో రామ్ చరణ్‌లోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసిన సుకుమార్, ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టార్‌తో జతకట్టబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు ప్రాధాన్యత ఉందని, ఆ పాత్రల కోసం మలయాళ ముద్దుగుమ్మ..
Also Read : Rajinikanth: రజనీ చిత్ర నిర్మాతకు హైకోర్టు షాక్.. రూ.2.5 కోట్లు కట్టాల్సిందే, లేదంటే జైలుకే!
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
అనుపమ పరమేశ్వరన్, కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో చరణ్ సినిమాల్లో నటించే అవకాశం అనుపమకు తృటిలో మిస్ అయ్యింది, కానీ సుకుమార్ మార్క్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె నటనకు మంచి స్కోప్ ఉండటంతో ఈసారి ఆమె ఎంపిక దాదాపు ఖాయమని తెలుస్తోంది. తన కళ్ళతోనే పలికించే హావభావాలతో మెప్పించే అనుపమకు, ఈ సినిమా కెరీర్ లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది. ఇక మరోవైపు కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’తో తెలుగు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన రుక్మిణి వసంత్, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ భామ.. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ముందు నుండి కూడా సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చాలా బలంగా చూపిస్తాడు. ఇదే కనుక నిజం అయితే రుక్మిణి కెరీర్‌కి, అనుపమ కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!