Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Second Song: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఏకంగా 200మిలియన్ కి పైగా వ్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాతి సాంగ్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తిగా వేయిట్ చేస్తున్నారు.
Also Read
ఈ సినిమా సెకండ్ సింగిల్ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్‌గా మారింది. పలు నివేదికల ప్రకారం.. మేకర్స్ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ సాంగ్ పక్కా మాస్ అని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్‌కి కాబోతుంది.
READ ALSO: Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!