Site icon NTV Telugu

Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ వైరల్!

Peddi, Ramcharan, Mrunal Tagur

Peddi, Ramcharan, Mrunal Tagur

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అటు మెగా అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పల్లెటూరి నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్న తరుణంలో, ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో ఉండబోయే ఒక ‘స్పెషల్ మాస్ సాంగ్’

సాధారణంగా బుచ్చిబాబు సినిమాల్లో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా ఒక స్పెషల్ నంబర్‌ను ప్లాన్ చేయడం ఆయన స్టైల్. అయితే ఈ పాటలో చరణ్‌తో కలిసి స్టెప్పులేయబోయే ఆ ‘బ్యూటీ’ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా తారక్ పొన్నప్ప, ఆయేషా ఖాన్ వంటి పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ లక్కీ ఛాన్స్ టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ వరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్.. మొదటిసారి ఇలాంటి స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేయడం విశేషం. రీసెంట్‌గా ఆమె నటించిన ‘డెకాయిట్’ సినిమాపై చరణ్ పాజిటివ్‌గా స్పందించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్, థియేటర్లలో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version