Peddi : పెద్ది.. పరిగెత్తాల్సిందే.. లేదంటే ఇబ్బంది తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పెద్ది సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నిజానికి, వచ్చే నెలలో.. అంటే మార్చ్ 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ డిలే కారణంగా మరో నెల రోజులు వాయిదా వేసి ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచి చూసుకుంటే.. రిలీజ్‌కు మూడు నెలల సమయం కూడా లేదు. కానీ, షూటింగ్ మాత్రం ఇంకా చాలానే పెండింగ్ ఉందట. ఇంకా 40 నుంచి 45 రోజులు వర్క్ ఉందట. పెద్ది విడుదల చూసుకుంటే 80 రోజులు మాత్రమే ఉంది.
Also Read : Ajith : రెమ్యూనరేషన్ కారణంగా హోల్డ్ లో పడిన అజిత్ సినిమా?
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
ఈ లెక్కన పెద్ది రిలీజ్ టార్గెట్ రీచ్ కావాలంటే ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాల్సిందే. లేదంటే.. మరోసారి పెద్ది పోస్ట్‌పోన్ తప్పదు. అయితే, షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చేయగా.. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు.. కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతోంది చిత్ర యూనిట్. లేటెస్ట్‌గా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు మేకర్స్. పెద్ది ప్రొడక్షన్ డిజైనర్ పుట్టినరోజును చిత్రబృందం ఘనంగా జరుపుకుంది. షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లోనే కేక్ కట్ చేశారు. ఆ ఫోటోల్లో రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి పెద్ది షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
-
Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!