Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.
Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి.. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, ఫస్ట్ లుక్ విడుదల
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు అదిరిపోయే బీట్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైల్, స్వాగ్, గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్ పాటకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సాంగ్‌కు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా లైక్స్, మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ‘చికిరి చికిరి’ పాట వైరల్గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా రీల్స్, యూట్యూబ్‌లో 8.7 లక్షలకు పైగా షార్ట్స్ ఈ పాట హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తూ ట్రెండ్ అయ్యింది.
వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ చిత్రం మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
