గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.. సాంగ్ తర్వాత మరో అప్డేట్ ను ప్రకటించలేదు..
తాజాగా రామ్ చరణ్ చైన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈరోజు రామ్ చరణ్ కనిపించారు. గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ చెన్నైకి ప్రయాణం అయ్యారు.. ఇక సినిమా త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మరోవైపు దిల్ రాజు మాత్రం దసరాకు సినిమాను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామంటూ ఇటీవల ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే సినిమా ఇప్పటిలో వచ్చేలా లేదు..
రామ్ చరణ్ తొలిసారి పొలిటికల్ డ్రామా సినిమాను చేస్తున్నారు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.. ఇక రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ కాంబోలో మరో సినిమాను చేస్తున్నాడు..