Site icon NTV Telugu

Unstoppable 2: ప్రభాస్ పెళ్లి గురించి లీక్ చేసిన చరణ్.. వైరల్‌గా మారిన గ్లింప్స్

Prabhas

Prabhas

Unstoppable 2: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బాలయ్య.. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సీజన్ 2లో భాగంగా రాజకీయ నాయకులు, పాన్ ఇండియా హీరోలు వచ్చి ఈ షోలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి బాలయ్య టాక్ షోకు హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను ఆహా ఓటీటీ విడుదల చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also:lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు

ఈ గ్లింప్స్ చూసిన డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ఎక్స్‌ప్రెషన్స్, అతడి ప్రజెన్స్ అదుర్స్ అని కితాబిస్తున్నారు. రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హీరో రామ్‌చరణ్‌ను ఉద్దేశించి ప్రభాస్ ఈ డైలాగ్ వాడినట్లు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్‌ వీడియో కాల్ ద్వారా ప్రభాస్‌ను పలకరించాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభాస్ సీక్రెట్ చెప్పాలని చెర్రీని బాలయ్య అడగ్గా.. పెళ్లి ఇంకో రెండు నెలల్లో జరగబోతోందని చరణ్ లీక్ చేసినట్లు సమాచారం. అందుకే ఏం చెప్తున్నావు డార్లింగ్ అంటూ చెర్రీని ప్రభాస్ అన్నట్లు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ లీక్ చేశాడో లేదో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Exit mobile version