మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతున్నాయి..
తన భార్య, కూతురు తో కలిసి రామ్ చరణ్ వైజాగ్ కు తెలుస్తుంది.. షూటింగ్ లో బ్రేక్ దొరకడంతో రామ్ చరణ్, ఉపాసన, కూతురితో బీచ్ లో సందడి చేశారు. తన కూతురితో కలసి అలలను తాకుతూ ఎంజాయ్ చేశారు.. బీచ్ లో రామ్ చరణ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. అవి చూసిన ఫ్యాన్స్ క్లింకార సైడ్ పేస్ రామ్ చరణ్ లాగే ఉంది.. మొత్తం తండ్రిలాగే ఉన్నట్లు కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమాను లైన్లో పెట్టాడు.. RC16 మూవీగా మొదలు కానుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇవాళ మొదలు కానుందని తెలుస్తుంది.. ఈ సినిమా లాంచ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు సమాచారం.. ఉత్తరాంద్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్తగా కనిపించబోతున్నాడు.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు..
Rhyme gadu 😂😂 pic.twitter.com/xYPTF6yNvK
— Raees (@RaeesHere_) March 19, 2024