Game Changer : సంక్రాంతికే ‘గేమ్ చేంజర్’.. మెగాస్టార్ కు ధన్యవాదాలు చెప్పిన దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్ మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్ మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్ మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యువీ వారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. ‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతికి రావటానికి వాళ్ల విశ్వంభర సినిమాను మరో రిలీజ్ డేట్‌కు విడుదల చేయాలనుకున్నారు. నిజానికి విశ్వంభర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా పూర్తవుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మరో రిలీజ్ డేట్‌కు రిలీజ్ చేయటానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతూ రాత్రింబగళ్లు కష్టపడుతున్నాం. ఆల్ రెడీ రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా వచ్చిన ‘రా మచ్చా మచ్చా..’ యూ ట్యూబ్‌లో మారుమోగిపోతుంది. తర్వాత టీజర్ వస్తుంది. తర్వాత మరో మూడు పాటలను రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. అటు రామ్ చరణ్‌గారికి గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే పడిందో దాన్ని.. గ్లోబల్‌గా ఈ సినిమా విజయం సాధించేలా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం ఫలిస్తుంది. సంక్రాంతికి కలుద్దాం’’ అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read Also:America vs Iran: ఇరాన్పై అమెరికా ఆంక్షలు.. ఎందుకో తెలుసా..?
Read Also:Honeymoon Express: ఆహాలో ట్రెండింగ్‌గా హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!