ఏ రాష్ట్రంలో రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. గతం కన్నా ఎక్కువ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, ఇంకా కొంత మొత్తమే ఇవ్వాల్సి ఉందన్నారు. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఫెర్టిలైజర్ షాపులకు వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ కృత్రిమ కొరత సృష్టిస్తుందని ఎద్దేవా చేశారు. యూరియా కొరతపై తాను డిబేట్‌కు సిద్ధం అని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రండని రాంచందర్ రావు సవాల్ విసిరారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ కీలక నిర్ణయం.. ఆ కక్కుర్తి ఏంటి అంటూ ఫాన్స్ ఆగ్రహం!
‘ఏ రాష్ట్రంలో రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుంది. యూరియాను గతం కన్నా ఎక్కువగా తెలంగాణకు కేంద్రం ఇచ్చింది. ఇంకా కొంత మాత్రమే ఇవ్వాల్సి ఉంది. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారు. కాంగ్రెస్ నాయకులే ఫెర్టిలైజర్ షాపులకు వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారు. కేంద్రం రైతులకి మేలు చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం రైతులకు ద్రోహం చేస్తుంది. ఎరువులు ఎటు వెళ్తున్నాయో దమ్ముంటే దర్యాప్తు చేయండి, లేదంటే సీబీఐకి అనుమతి ఇవ్వండి. దర్యాప్తుకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వంకు దమ్ము లేదు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వస్తె అక్కడ ఆ పార్టీ నాయకులే దళారులు. నాయకులే బ్లాక్ మార్కెట్ చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత కోటా అనేది ముందే ఫిక్స్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ ఆరోపణలు కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ కృత్రిమ కొరత సృష్టిస్తుంది. నేను డిబేట్‌కు సిద్ధంగా ఉన్నా, దమ్ముంటే రండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్ విసిరారు.