టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి వరుస హిట్ లు అందుకుంది. కానీ ఏ ఇండస్ట్రీ అయిన హీరోయిన్‌ల కెరీర్ ఒకనోక్క సమయంలో పడిపోతుంది అని చెప్పలేం కానీ అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో వాడు వెరే ఇండస్ట్రీ బాట పడతారు. అలా రకుల్ కూడా బాలీవుడ్ లో ఏంట్రీ ఇచ్చింది. కానీ.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read : Anil Ravipudi : ఎన్ని హిట్లు కొట్టిన ఆ విషయంలో మాత్రం మారను..
రకుల్ మాట్లాడుతూ.. ‘నేను తెలుగులో పెద్ద స్టార్‌ని అని తెలిసినా, బాలీవుడ్ మేకర్స్ నన్ను ఒక కొత్త నటిగానే చూశారు. అక్కడ మళ్ళీ సున్నా నుండే మొదలుపెట్టాల్సి వచ్చింది. అని రకుల్ తెలిపారు. ముఖ్యంగా నెపోటిజం గురించి ప్రస్తావిస్తూ.. ‘మనం బయటి వ్యక్తులం కాబట్టి మనకు రెడ్ కార్పెట్ వెల్‌కమ్ ఉండదు. కాస్టింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేస్తే కనీసం ఎత్తేవారు కాదు, ఒకవేళ ఎత్తినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు’ అని ఆమె తన బాధను వ్యక్తం చేశారు. ఒక ఆడిషన్ కోసం గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం తన మానసిక ధైర్యాన్ని పరీక్షించిందని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, పట్టుదలతో ‘దే దే ప్యార్ దే’, ‘రన్ వే 34’ వంటి సినిమాలతో అక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత ఆమెకు కొంత సెక్యూరిటీ లభించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘పతి పత్ని ఔర్ వో’ రీమేక్‌తో పాటు, శంకర్ డైరెక్షన్‌లో ‘భారతీయుడు 3’ అప్‌డేట్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం రకుల్ మళ్ళీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
