రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు వరసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపించింది.. ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరగబోతోంది. ఫారెన్ కంట్రీస్ లో పెళ్లి చేసుకోవాలని రకుల్ అనుకున్న ఇప్పుడు గోవాలో చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు..
గోవాలోని ఓ లగ్జరీ హోటల్ లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్ వీరి పెళ్లి వేదిక అయింది. గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ ఇది.. విశాలవంతమైన ఈ హోటల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది.. అంతేకాదండోయ్ ఈ అందమైన హోటల్ లో ఒక్కో రూమ్ కూడా భారీగానే ఉంటుంది..
ఒక్కో రూమ్ కు రూ. 19 వేల నుంచి 75 వేల వరకు రెంట్ చెల్లించాల్సిందే అట. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట తమ వెడ్డింగ్ కోసం మొత్తం మూడు రోజుల పాటు ఐటీసీ హోటల్ ను బుక్ చేసుకున్నారట. ఇందుకుగానూ వారు భారీగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం.. ఈ నెల 19 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి.. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. అలాగే రకుల్, జాకీల పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగబోతోంది. అతిథులకు డిజిటల్ ఆహ్వానమే పంపారు. మరియు పెళ్లి వేడుకల్లో పటాకులకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. అయలాన్ మూవీతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో శివ కార్తికేయన్ కు జోడీగా రకుల్ నటించింది. జనవరి ఆఖరి వారంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.బాలీవుడ్ లో పలు సినిమాలు కూడా చేస్తుంది..